పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన భారత సైన్యం | - | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన భారత సైన్యం

May 21 2025 8:41 AM | Updated on May 21 2025 8:41 AM

పాకిస

పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన భారత సైన్యం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి

మోమిన్‌పేట: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మేకవనంపల్లి నుంచి మోమిన్‌పేట, మొరంగపల్లి, వెల్‌చాల్‌, గోవిందాపూర్‌ మీదుగా ఎన్కతల గ్రామం వరకు తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను భారత సైన్యం తుద ముట్టించిందన్నారు. అక్కడి పౌరులకు ఇబ్బందులు లేకుండా కేవలం ఉగ్ర స్థావరాలనే టార్గెట్‌ చేసిందని పేర్కొన్నారు. భారత సైన్యం ముందు నిలువలేక అగ్రరాజ్యం అమెరికా కాళ్లు పట్టుకొందని తెలిపారు. భవిష్యత్‌లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే ఇదే విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వడ్ల నందు, మండల అధ్యక్షుడు అశిరెడ్డి, మండల మాజీ అధ్యక్షులు భుజంగ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రమేష్‌, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

అర్హులకే సంక్షేమ పథకాలు

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

యాలాల: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం యాలాలలోని ఎంపీడీఓ సమావేశ మందిరంలో ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 మంది లబ్ధిదారులకు రూ.75.08 లక్షల విలువ చేసే చెక్కులు అందజేసినట్లు వివరించారు. ఎన్నికల హామీలను దశల వారీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, కోఆప్షన్‌ మాజీ సభ్యుడు అక్బర్‌బాబా, మాజీ సర్పంచులు శ్రీనివాస్‌, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

మెరుగైన వైద్య సేవలే మన బాధ్యత

జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటరవణ

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఎంఎల్‌హెచ్‌పీలకు అవగాహన

అనంతగిరి: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు బాధ్యతతో విధులు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటరవణ వైద్యులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీలకు వైద్య ఆరోగ్య శాఖ అందిస్తున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు పనిచేయడం, ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడం గురించి ఒక్క రోజు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పీహెచ్‌సీల వైద్యులు, ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌లో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీలు విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలైన మాతా శిశు సంరక్షణ సేవలు, వ్యాధి నిరోధక టీకాలు, కీటక జనత వ్యాధులు వంటి కార్యక్రమాల అమలు చేయాలన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఇళ్లల్లోనే ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. ఇక వేళ బయటికి వెళ్లాల్సి వస్తే ఎండ నుంచి రక్షణ పొందే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఫార్మసీ ఆఫీసర్లకు స్టాక్‌ నిర్వహణ, పంపిణీ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జీవరాజు, పీఓలు డాక్టర్‌ పవిత్ర, బుచ్చిబాబు, జానీ, నిరోషా, ప్రవీణ్‌కుమార్‌, నిఖిల్‌, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, స్టాటిస్టికల్‌ అధికారి నాగమల్లేశ్వరరావు, రవీందర్‌రెడ్డి, శివశంకర్‌, జిల్లా పరిఽధిలోని ఫార్మసీ ఆఫీసర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు, సూపర్‌వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన భారత సైన్యం 1
1/1

పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన భారత సైన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement