
వేసవి శిబిరాలతో విద్యార్థులకు మేలు
నవాబుపేట: వేసవి శిబిరాలు విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుస్తాయని మండల విద్యాధికారి అబ్దు ల్‌రెహమాన్ అన్నారు. మండల పరిధిలోని కడ్చర్ల ప్రాథమిక పాఠశాలలో పది రోజులుగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం సోమవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ మాట్లాడుతూ.. శిక్షణ ఫౌండేషన్, ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు సాంస్కృతిక , సృజనాత్మకత తదితర కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శిబిరంలో 50 మంది విద్యార్థులు పాల్గొనగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఫౌండేషన్ నిర్వాహకులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు అశోక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఎంఈఓ అబ్దుల్ రెహమాన్