
పనిచేసే కార్యకర్తలకే పదవులు
● పీసీసీ ఉపాధ్యక్షుడు, పరిశీలకుడు వినోద్‌రెడ్డి ● నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకే పదవులు ఇస్తామని పీసీసీ ఉపాధ్యక్షుడు, పరిశీలకుడు వినోద్‌రెడ్డి అన్నారు. బుధవారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అంటిపెట్టుకొని ఉన్నవారిని అధిష్టానం గుర్తిస్తుందన్నారు. పార్టీకి సేవ చేసిన వారి వివరాలు తమ వద్ద ఉన్నాయన్నారు. పార్టీ పదవుల్లో వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్‌ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువవికాసం వంటి వాటిపై ఇంటింట ప్రచారం చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిగి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభి వృద్ధి చేస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. ఈ ప్రాంతానికి వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ స్పోక్స్ పర్సన్ నరేందర్ యాదవ్, పీసీసీ సభ్యుడు రితిక్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పూడూరు, దోమ, చౌడాపూర్ మండలాల అధ్యక్షులు సురేందర్ ముదిరాజ్, విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.