
రైతులకు ఇబ్బందులు రానివ్వం
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్
యాలాల: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. బుధవారం మండల కేంద్రంతో పాటు బెన్నూరు, లక్ష్మినారాయణపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసి న కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశా రు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు ధా న్యం తడవకుండా, తూకం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. తూకం వేసిన ధా న్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. లారీల కొరత ఉందని ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఆర్‌ఐ వేణు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి టీబీ ముక్త్ అభియాన్
అనంతగిరి: జిల్లాలో ఈ నెల 22 నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్. వెంకటరవణ, జిల్లా టీబీ ప్రొగ్రాం అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 రోజులు పాటు క్షేత్రస్థాయిలో టీబీ రోగులకు గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం జిల్లాకు ప్రత్యేకంగా పోర్టబుల్ ఎక్స్‌రే మిషన్ వచ్చిందన్నారు. 2030 నాటికి దేశంలో టీబీని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోందన్నారు. టీబీని ప్రాథమిక దశలోనే గుర్తించడం, సరైన చికిత్స అందించడం, చికిత్స మధ్యలో ఆపివేయకుండా చూసుకోవడంతో వ్యాధిని సమూలంగా నిర్మూలించవచ్చన్నారు. చికిత్స పొందుతున్న రోగులకు ఆరు నెలల పాటు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పోషకాహారం కోసం ఇవ్వనున్నట్లు వివరించారు.
పాఠశాల పునర్నిర్మాణానికి రూ.10 లక్షల విరాళం
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని పాత శిశుమందిరం పునర్నిర్మాణానికి పూర్వ విద్యార్థులు ముందుకు వస్తున్నారు. బుధవారం పాఠశాల పూర్వ విద్యార్థి చంద్రశేఖర్‌రెడ్డి తనవంతుగా రూ.10 లక్షలు అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును పాఠశాల విద్యాపీఠం ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన్ను ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు అభినందించారు.
ఏపీఎంపై
డీఆర్‌డీఓకు ఫిర్యాదు
నందిగామ: నందిగామ మండల మహిళా సమాఖ్యలో ఏపీఎంగా పనిచేస్తున్న యాదగిరి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సీసీ యాదయ్య జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వీర్లపల్లి సంఘంలో ఎలాంటి తీర్మానాలు లేకుండా రూ.3 లక్షలు చెక్కురూపంలో నిధులను మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే క్లస్టర్‌లో సీసీగా పనిచేస్తున్న తనకు ఈ విషయం తెలియడంతో ఏపీఓను ప్రశ్నించగా తననే దూషించారన్నారు. ఈ విషయమై డీఆర్‌డీఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై ఏపీఎం యాదగిరిని వివరణ కోరగా.. అందులో తన ప్రమేయం లేదని, అకారణంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, నిజానిజాలు విచారణలో తేలుతాని స్పష్టంచేశారు.
ఇబ్రహీంపట్నం ఎస్‌ఐపై వేటు
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఎస్‌ఐగా పనిచేస్తున్న శ్రీనివాస్‌పై వేటు పడింది. ఆయనను మల్టీజోన్ రేంజ్ ఆఫీస్‌కు సరెండర్ చేస్తూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో మంచాల ఎస్‌ఐగా విధులు నిర్వర్తించిన శ్రీనివాస్ ఓ యాక్సిడెంట్ కేసును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై, విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈక్రమంలో రెండు రోజుల క్రితమే ఆయన ఇబ్రహీంపట్నం పీఎస్ నుంచి రిలీవ్ అయినట్లు సమాచారం.

రైతులకు ఇబ్బందులు రానివ్వం

రైతులకు ఇబ్బందులు రానివ్వం