
వికారాబాద్‌లో తనిఖీలు
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని పలు బహిరంగ ప్రదేశాల్లో బుధవారం డాగ్ స్క్వాడ్, బీడీ టీంలు తనిఖీలు చేపట్టాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు వారు తెలిపారు.
కడ్తాల్ ఎస్‌ఐకి ఉత్తమ పోలీసు అధికారి అవార్డు
కడ్తాల్: నేర పరిశోధన విభాగం 2024 సంవత్సరానికి సంబంధించి, రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కడ్తాల్ ఎస్‌ఐ వరప్రసాద్ ఉత్తమ పోలీస్ అధికారిగా అవార్డు అందుకున్నారు. పీఎస్ పరిధిలో నమోదైన పలు కేసులను వేగంగా దర్యాప్తు చేయడంతో, ఉత్తమ సేవలకు గానూ బుధవారం డీజీపీ జితేందర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. బెస్ట్ ఎస్‌ఐ వరప్రసాద్‌తో పాటు బెస్ట్ హోంగార్డుగా అవార్డు తీసుకున్న పాండును సీఐ గంగాధర్, పోలీసులు అభినందించారు.
ప్రేమ పేరుతో మోసం
సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి రిమాండ్
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆదిబట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరువూరుకు చెందిన దుబ్బాక సాగరిక ఆదిబట్ల టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. 2022లో కోల్‌కటా టీసీఎస్‌లో పని చేసిన సమయంలో సహోద్యోగి పత్లావత్ సంజీవతో ఆమెకు పరియచం ఏర్పడింది. ప్ర స్తుతం వీరిద్దరూ ఆదిబట్ల టీసీఎస్‌లో ఉద్యో గం చేస్తూ సహజీవనంలో ఉన్నారు. ఈక్రమంలో సాగరిక గర్భం దాల్చింది. దీంతో సంజీవ ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. అనంతరం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మొహం చాటేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఆదిబట్ల పోలీసులు, బుధవారం అతన్ని రిమాండ్‌కు తరలించారు. సాగరికకు అబార్షన్ చేసిన తుర్కయంజాల్‌లోని మహోనియా ఆస్పత్రిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.