
విరిగిన చెట్ల కొమ్మలు
మొయినాబాద్: అకాల వర్షం ఆగమాగం చేసింది. మొయినాబాద్ మున్సిపాలిటీతోపాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై పలు చోట్ల వర్షపు నీరు నిలిచింది. మున్సిపల్ కేంద్రంతోపాటు అజీజ్‌నగర్ చౌరస్తా, హిమాయత్‌నగర్ చౌరస్తా, గండిపేట చౌరస్తా, కనకమామిడి గేటు సమీపంలో రోడ్డుపై వర్షం నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బలమైన ఈదురుగాలులకు ముర్తుజాగూడలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడ్డాయి. సుమారు నాలుగు గంటలపాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది.