
కొనసాగుతున్న శిక్షణ తరగతులు
దౌల్తాబాద్: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఎఫ్‌ఎల్‌ఎన్ కెపాసిటీ బిల్డింగ్‌పై శిక్షణ నిర్వహిస్తున్నారు. బుధవారం రెండో రోజు శిక్షణలో పలు విషయాలు తెలియజేశారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఆర్‌పీలు సాయిలు, భీమప్ప చెప్పారు. గణితం, తెలుగు సామాన్యశాస్త్రం సబ్జెక్టులపై శిక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకట్‌స్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
గేదె మృతి
కుల్కచర్ల: విద్యుదాఘాతంతో ఓ గేదె మృతిచెందిన ఘటన చౌడాపూర్ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం కల్మన్‌కాల్వ గ్రామం పెద్దోళ్ల రాజేందర్‌రెడ్డికి చెందిన గేదె తన పొలంలో గాలికి తెగిపడిన విద్యుత్తు వైరుకు తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. సుమారు రూ.లక్ష వరకు నష్టపోయామని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
అదుపుతప్పి కారు బోల్తా
మొయినాబాద్: అతివేగంతో వెళ్లిన కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటన మొయినాబాద్ మండల పరిధిలోని అమ్డాపూర్ రోడ్డులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం జేబీఐటీ కళాశాల వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న క్వాలీస్ కారు అతివేగంతో వెళ్తూ అమ్డాపూర్ గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. అతనికి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
లయన్స్ క్లబ్ సౌజన్యంతో సైకిళ్ల అందజేత
కందుకూరు: లయన్స్ క్లబ్ సౌజన్యంతో దెబ్బడగూడకు చెందిన పేద విద్యార్థినులు సురక్షిత, ప్రవీణకు బుధవారం ఈ–సైకిళ్లు అందజేశారు. లయన్స్ క్లబ్ జిల్లా వైస్ గవర్నర్ జి.మహేంద్రకుమార్‌రెడ్డి చేతుల మీదుగా బాలికలకు అందించి ఒక్కో సైకిల్ ధర రూ.10 వేలు ఉంటుందని కోశాధికారి కె.వెంకటేశ్వర్లుగుప్తా తెలిపా రు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి తాళ్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న శిక్షణ తరగతులు

కొనసాగుతున్న శిక్షణ తరగతులు

కొనసాగుతున్న శిక్షణ తరగతులు