
నేటి నుంచి ఇంటర్ ‘సప్లిమెంటరీ’
తాండూరు టౌన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయి. ఆదివారం సైతం పరీక్ష కొనసాగనున్నది. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిద్ధార్థ, సింధు బాలికల, తెలంగాణ మైనారిటీ బాలికల కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జనరల్ విభాగంలో ఫస్టియర్ 2,965 మంది, సెకండియర్ 952 మంది విద్యార్థులు, ఒకేషనల్ విభాగంలో ఫస్టియర్ 454 మంది, సెకండియర్ 292 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు కస్టోడియన్ కృష్ణయ్య తెలిపారు. పరీక్షల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటుచేయనున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.
ఒకే కేంద్రంలో పరీక్షలు
కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షలకు కేంద్రం లోపలికి అరగంట ముందు అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ పరీక్షలకు హాజరుకావాలని చెప్పారు.
తాండూరులో నాలుగు పరీక్ష కేంద్రాలు