భూ సమస్యల పరిష్కారానికే కొత్త చట్టం
ఆర్డీఓ వాసుచంద్ర
ధారూరు: భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిందేని ఆర్డీఓ వాసుచంద్ర తెలిపారు. మంగళవారం మండలంలోని దోర్నాల్, గురుదోట్ల, కుమ్మర్‌పల్లి గ్రామాల్లో కొత్త చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో భూ సమస్యల పరిష్కారానికి ఆర్‌డీఓ, కలెక్టర్, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, కొత్త చట్టం ద్వారా గ్రామంలోనే సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆయా గ్రామాల్లో రైతుల నుంచి 35 దరఖాస్తులు స్వీకరించారు. త్వరలో వీటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీనివాస్, సాజిదాబేగం, దీపక్, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.


