అభివృద్ధికి అడిగినన్ని నిధులు
స్పీకర్ ప్రసాద్‌కుమార్
బంట్వారం: అభివృద్ధి పనులకు అడిగినన్ని నిధులు మంజూరు చేస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. సల్బత్తాపూర్ సర్పంచ్ బుర్నాపూర్ బాలయ్య ఆదివారం నగరంలో స్పీకర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ వారిని అభినందించారు. గ్రామాభివృద్ధికి నిరంతరం శ్రమించాలని, తనవంతు సహకారం సంపూర్ణంగా ఉంటుందని చెప్పారు. సమస్యలు వివరించగా.. స్పీకర్ సానుకూలంగా స్పందించారని సర్పంచ్, నాయకులు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
చేవెళ్ల: గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..ఆదివారం చేవెళ్లలోని ఓ రోడ్డుపక్కన గోడకు ఆనుకొని కదలలేని వ్యక్తిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని పరిశీలించగా అతడు అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. తక్షణమే పోలీసులు పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అయితే అతడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియదు? మృతుని వద్ద కూడా ఎలాంటి గుర్తింపు ఆనవాళ్లు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు దాదాపు 35నుంచి 45 ఏళ్ల వయసుఉంటుందని, నీలి రంగు షర్టు, ఖాకీ రంగు ప్యాంటు ధరించినట్లు తెలిపారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే 7901099443, 8712554143లకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ శిరీష తెలిపారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
మిద్దె తోటకు
గోల్డెన్ జూబ్లీ వేడుకలు
శంకరి గార్డెన్‌లో సంబురాలు
తాండూరు టౌన్: మిద్దె తోటకు గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు ప్రకృతి ప్రేమికులు. పట్టణంలోని సావుకార్‌పేటకు చెందిన మంతటి శంకరమ్మ, సంగమేశ్వర్ దంపతులు టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేశారు. శంకరమ్మకు చిన్ననాటి నుంచే మొక్కలంటే మక్కువ. తన తండ్రి ప్రోద్భలంతో 1975 నుంచి మిద్దైపె మొక్కలను పెంచుతున్నారు. ఈ తోటకు శంకరి గార్డెన్ అని నామకరణం చేశారు. ఈ టెర్రస్ గార్డెన్ నిర్వహణ చేపట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె చిన్ననాటి మిత్రులను పిలిచి ఆదివారం కేకు కట్ చేసి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరమ్మ మాట్లాడుతూ.. తన తండ్రి స్ఫూర్తితో 8వ తరగతి నుంచి మిద్దైపె పలు రకాల పూలు, పండ్లు, జౌషధ, కూరగాయల మొక్కలను పెంచుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా శంకరమ్మ దంపతులను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధనా స్థానం హెడ్ సైంటిస్ట్ డాక్టర్ సుధారాణి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కొట్రిక విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ బీజేపీదే
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్
యాచారం: రాష్ట్రంలో భవిష్యత్ బీజేపీదేనని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనను చూసి ప్రజలు విసుగుచెందారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. యాచారం మండల పరిధిలోని చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన 50 మందికి పైగా వివిధ పార్టీల కార్యకర్తలు ఆదివారం సీనియర్ నాయకులు నడుకుడి కృష్ణ, నాయిని పాండు, శ్రీనగరం రమేశ్ ఆధ్వర్యంలో ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ఓరిగిందేమి లేదన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటైతే ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జరుపుల విజయ్‌నాయక్, సీనియర్ నాయకులు అంబోజ్ జగదీష్ యాదవ్, నాగరాజు పాల్గొన్నారు.
అభివృద్ధికి అడిగినన్ని నిధులు
అభివృద్ధికి అడిగినన్ని నిధులు
అభివృద్ధికి అడిగినన్ని నిధులు


