దొంగకు రిమాండ్
17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
మీర్‌పేట: ద్విచక్ర వా హనాలు దొంగతనం చేస్తున్న వ్యక్తిని మీ ర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ శంకర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్‌కు చెందిన కొలుపురి శ్రీను (39) మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. అతను వైన్‌షాపులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలాల్లో, పార్కు చేసిన వాహనాలను చోరీ చేసేవాడు. ఆదివారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని అదుపులోకి తీసుకుని సంబంధిత వివరాలు సేకరించారు. చేసిన తప్పులను ఒప్పుకోవడంతో అతని వద్ద నుంచి 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
ముగిసిన అథ్లెటిక్స్ పోటీలు
ద్వితీయస్థానంలో రంగారెడ్డి
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ మాస్టర్ అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో జరుగుతున్న చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఓవరాల్ చాంపియన్ షిప్‌ను మేడ్చల్ జిల్లా జట్టు కై వసం చేసుకుంది. రన్నరఫ్‌గా రంగారెడ్డి జిల్లా జట్టు నిలిచింది. విజేతలకు తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్ గౌడ్ ట్రోఫీలు ప్రదానం చేశారు. 18 జిల్లాల నుంచి సుమారు 900 మందికి పైగా 30 నుంచి 90 సంవత్సరాల వయస్సు వారు పోటీలకు హాజరైనట్లు తెలిపారు. రాణించిన మాస్టర్ అథ్లెట్లను జాతీయస్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు.
చాంపియన్ మేడ్చల్..
పోటీల్లో రన్స్, త్రోస్, జంప్స్ విభాగాల్లో రాణించి ఎక్కువ పతకాలు కై వసం చేసుకున్న మేడ్చల్ జిల్లా జట్టు 581 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచింది. రంగారెడ్డి జిల్లా జట్టు 252పాయింట్లతో ద్వితీయ స్థానంలో ఉంది. పురుషుల విభాగంలో మేడ్చల్ 250 పాయింట్లతో, మహిళల విభాగంలో మేడ్చల్ 331పాయింట్లతో చాంపియన్ షిప్ కై వసం చేసుకున్నాయి.


