కబడ్డీ విజేతలు వీరే..
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో కబడ్డీ జిల్లా సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజలు పాటు జరిగిన 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో సూర్యపేట జిల్లా జట్టు ఛాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకోగా.. మహిళల విభాగంలో హైదరాబాద్–2 జట్టు విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో రన్నర్‌గా జోగులాంబ గద్వాల్ జట్టు, తృతీయస్థానాల్లో నిజామాబాద్, నాగర్ కర్నూల్ నిలిచాయి. మహిళల విభాగంలో రన్నర్‌గా రంగారెడ్డి జిల్లా జట్టు, తృతీయ స్థానాల్లో వరంగల్, ఖమ్మం జట్లు నిలిచాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందని తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు రెండు ఆస్ట్రోటర్ఫ్ కోర్టులు ఇచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర పోటీలతో కబ్డడీకిమరింత క్రేజ్ వచ్చిందన్నారు. మహిళల జాతీయస్థాయి కబడ్డీ పోటీలు హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరుగుతాయని, ఇక్కడ రాణించిన క్రీడాకారులను తెలంగాణ జట్లకు ఎంపిక చేస్తామని కబడ్డీ సంఘం రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు కాసాని వీరేశం, మహేందర్‌రెడ్డితెలిపారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్‌రావు, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, సంఘం జిల్లా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అమిత్ కుమార్, మల్లేశంగౌడ్ పాల్గొన్నారు.
రన్నర్‌గా రంగారెడ్డి జిల్లా
ముగిసిన 72వ రాష్ట్రస్థాయి
సీనియర్స్ పోటీలు


