ఉద్దేశపూర్వకంగానే మార్పు
● ఉపాధి పథకానికి గాంధీ పేరునుకొనసాగించాలి:కాంగ్రెస్ నాయకుల డిమాండ్
● కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు
పూడూరు: దేశ వ్యాప్తంగా నిరుపేదల కడుపు నింపుతున్న జాతీయ ఉపాధిహామీ పథకం పేరునుకేంద్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే మార్చిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్‌ఆరోపించారు. ఆదివారం మండల పరిధి మన్నెగూడ కూడలిలో కేంద్రానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి పథకం పేర్పు మార్పు సరికాదని, గాంధీ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొన్నారు. డీసీసీ ఉపాధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శులు శ్రీనివాస్, అజీంపటేల్, సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, కిజర్‌పాషా, వీరేష్ పాల్గొన్నారు.
కుల్కచర్లలో..
కుల్కచర్ల: ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రచేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పథకం పేరు మార్పును నిరసిస్తూ.. కుల్కచర్ల, చౌడాపూర్ మండల కేంద్రాల్లో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేశారు. ఇందులో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, పాంబండ ఆలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉద్దేశపూర్వకంగానే మార్పు


