
వేధింపులు తాళలేక..
అనంతగిరి: వేధింపులు తాళలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన వికారాబాద్ పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సీఐ భీంకుమార్ తెలిపిన ప్రకారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన వడ్ల హన్మండ్లు–చంద్రకళ దంపతుల కుమార్తె అశ్విని(39)కి వికారాబాద్‌కు చెందిన కమ్మరి శ్రావణ్‌కుమార్‌తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. కుటుంబ పోషణకు అశ్విని టైలరింగ్ షాప్ నిర్వహిస్తుండేది. పైళ్లెన ఐదేళ్ల తర్వాత శ్రావణ్‌కుమార్ తాగుడుకు బానిసై తరచూ భార్యతో గొడపడేవాడు. ఈ క్రమంలో ఆస్తి పంచాలని అన్నను కోరడంతో నీ భార్య ఉన్నంత వరకు పంపకాలు చేసేది లేదని చెబుతున్నారంటూ ఈ నెల 18న మధ్యాహ్నం హనుమాండ్లకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం భార్యతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన అశ్విని అర్ధరాత్రి ఆమె బెడ్రూంలోని సీలింగ్‌ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం గమనించిన శ్రావణ్‌కుమార్ అదే రాత్రి 1.50గంటలకు మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చే వరకు మృతదేహాన్ని వికారాబాద్ మార్చురీలో భద్రపరిచారు. మృతురాలి తండ్రి తన కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత బలవన్మరణం