
ఆగని రేషన్ బియ్యం దందా
పోలీసుల దాడిలో పట్టుబడిన రేషన్ సన్న బియ్యం
కుల్కచర్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం సైతం అక్రమార్కుల ధనార్జనలో భాగమైంది. దొడ్డుబియ్యం అయితే ఏముంది సన్నబియ్యమైతే ఏముంది అనుకున్నారు రేషన్ అక్రమ సరఫర నిర్వాహకులు లబ్ధిదారుల నుంచి కొంచెం ధర ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న కుల్కచర్ల ఎస్‌ఐ రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం దాడులు నిర్వహించగా చౌడాపూర్ గ్రామానికి చెందిన చిట్టెల చంద్రశేఖర్ తన గోదాంలో ఐదు క్వింటాళ్ల రేషన్ సన్నబియ్యం నిల్వ ఉంచినట్లు గుర్తించారు. లబ్ధిదారులు తమ ఇష్టంతో అమ్మితేనే కొనుగోలు చేశానని బియ్యం విక్రేత పోలీసులకు తెలిపినట్లు సమాచారం. చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసి బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
యువతి అదృశ్యం
అనంతగిరి: వికారాబాద్ ఠాణా పరిధిలో ఓ యువతి అదృశ్యమైంది. సీఐ భీంకుమార్ తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని గిరిగేట్‌పల్లికి చెందిన వడ్డె నవనీత(19) ఈ నెల 16న భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించింది. ఉదయం లేచి చూడగా ఆమె ఇంట్లో కనిపించలేదు. ఎక్కడ వాకబు చేసినా ఆమె ఆచూకీ లభ్యమవ్వలేదు. ఈ మేరకు సోమవారం ఆమె తల్లి సరిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధ్దుడి అదృశ్యం
అనంతగిరి: వివాహానికి వెళ్లిన వృద్ధ్దుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ భీంకుమార్ తెలిపిన ప్రకారం.. మోమిన్ పేట మండలం రాంనాథ్‌గుడుపల్లికి చెందిన చాకలి పెద్ద నర్సింలు(75) ఈ నెల 16న వికారాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బంధువుల వివాహానికి హాజరయ్యాడు. అనంతరం పూడూర్‌లోని చిన్న కూ తురు ఇంటికి వెళ్తున్నాని చెప్పి బయలుదేరాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో సాధ్యమైన ప్రాంతాల్లో వాకబు చేసినా ఆచూకీ లభ్యమవ్వలేదు. ఈ మేరకు ఆయన కూతురు వర మ్మ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.

ఆగని రేషన్ బియ్యం దందా

ఆగని రేషన్ బియ్యం దందా