
ఎద్దు మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
తాండూరు టౌన్: విద్యుత్ కంచె వేసి ఎద్దు మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ నాయకులతో కలిసి బాధితురాలు తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ నెల 12న మండల పరిధిలోని బిజ్వార్‌లో పిట్ల యశోదకు చెందని ఎద్దు మేత మేస్తుండగా విద్యుధాఘాతంతో మృత్యువాత పడింది. అనుమతి లేకుండా పొలం చుట్టూ కంచె వేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, బుగ్గప్ప, అబ్దులప్ప, మొగులప్ప, బాలప్ప తదితరులు ఉన్నారు.
తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌కు బాధితురాలి వినతి