
రైతుల మనుసు గెలుచుకున్న తహసీల్దార్
బషీరాబాద్: భూ సమస్యలు పరిష్కారంలో తహసీల్దార్ వెంకటేశ్ శక్తి వంచన లేకుండా రైతుల మనుసు గెలుచుకున్నారని బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది కొనియాడారు. బషీరాబాద్ తహసీల్దార్‌గా 16 నెలలు పనిచేసిన వెంకటేశ్ సంగారెడ్డికి బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం కార్యాలయం అధికారులు, సిబ్బంది ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రుక్సానాబేగం, ఆర్‌ఐ నాగార్జున రెడ్డి, జూనియర్ అసిస్టెంట్స్ కృష్ణకుమార్, నవీన్, అంజిలప్ప, రికార్డు అసిస్టెంట్స్ నర్సమ్మ, బిచ్చప్ప, ముణ్యప్ప కంప్యూటర్ ఆపరేటర్ అరుణ్‌కుమార్, వీఆర్‌ఏలు శ్యామప్ప, మాడప్ప, నర్సప్ప, రాజు, హన్మంతు, అటెండర్స్ అనంతయ్య, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో విలేకరులు నర్సింలు, రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాందాస్, శ్రీనివాస్, హరిదాస్, జీవన్గీ నర్సిములు, గోపాల్‌తో పాటు మండల యువజన కాంగ్రెస్ నాయకుడు మాణిక్‌రావు తదితరులున్నారు.
బదిలీపై వెళ్లిన అధికారికి ఘనంగా వీడ్కోలు