
పాముకాటుకు ఎద్దు మృతి
తాండూరు రూరల్: పా ము కాటుకు ఎద్దు మృత్యువాత పడింది. ఈ ఘటన సోమవారం పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణంలోని భద్రేశ్వర ఆలయం ఎదుట కాలనీలో నివాసం ఉంటున్న రైతు పొట్టు శ్రీనివాస్‌కు రసూల్‌పూర్ ఆలయ సమీపంలో వ్యవసాయ భూమి ఉంది. ఈ క్రమంలో ఆయన ఎడ్లను మేపుతుండగా వరిబందంలో నాగుపాటు కాటేయడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఎద్దు విలువ రూ.50 వేలు ఉంటుందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.
పిడుగుపాటుతో..
మండల పరిధిలోని అంతారంలో సోమవారం పిడుగుపాటుకు కాడెద్దు మృత్యువాత పడింది. వివరాలు.. గ్రామానికి చెందిన బొడ్డె ప్రభాకర్ కాడెద్దుతో పాటు పశువులను మేతకోసం తీసుకెళ్లాడు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పొలంలో ఉన్న కాడెద్దుపై పిడుగుపడడంతో కాడెద్దు మృత్యువాత పడింది. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.

పాముకాటుకు ఎద్దు మృతి