పంట మార్పిడితో లాభాలు | - | Sakshi
Sakshi News home page

పంట మార్పిడితో లాభాలు

May 15 2025 9:02 AM | Updated on May 15 2025 9:02 AM

పంట మార్పిడితో లాభాలు

పంట మార్పిడితో లాభాలు

శాస్త్రవేత్తలు లక్ష్మణ్‌, రాజేశ్వర్‌రెడ్డి

కొడంగల్‌ రూరల్‌: వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు అందించే సూచనలు పాటిస్తూ రైతులు అధిక దిగుబడులు సాధించాలని తాండూరు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త టి.లక్ష్మణ్‌, వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త టి.రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని రుద్రారం గ్రామ రైతు వేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు అధికంగా యురియా వాడడంతో మట్టిలో జీవశక్తి తగ్గిపోతుందని, దీర్ఘకాలికంగా ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే క్రమంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంటలు నష్టపోయే క్రమంలో పరిహారం పొందేందుకు వీలుంటుందన్నారు. అధిక దిగుబడులు సాధించాలంటే ముందుగా పంట మార్పిడి పద్ధతులు పాటించాలని, దీంతో భూమిలో పండించే శక్తి మెరుగు పడుతుందన్నారు. వ్యవసాయాధికారుల సూచనలను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ తులసి, ఏఎంసీ చైర్మన్‌ అంబయ్యగౌడ్‌, గ్రామస్తులు ఆనంద్‌రెడ్డి, సాయిలు, హన్మయ్య, వెంకటయ్యగౌడ్‌, ఏఈఓలు శ్రీపతిరెడ్డి, సుమ, పావని, అశ్విని, రాజు, దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

యువత చేతుల్లోనే భవిష్యత్‌

మైనారిటీ గురుకులాల జిల్లా రీజనల్‌

లెవల్‌ కన్వీనర్‌ వినోద్‌ ఖన్నా

తాండూరు టౌన్‌: ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎక్సలెన్స్‌ అవార్డులను ప్రదానం చేయ డం అభినందనీయమని మైనారిటీ గురుకులాల జిల్లా రీజనల్‌ లెవల్‌ కన్వీనర్‌ వినోద్‌ ఖన్నా అన్నారు. బుధవారం ముస్లిం వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో ముస్లిం వెల్ఫేర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో 90 మంది ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌లో ఉత్తమ మా ర్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు అందజేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌ అంతా యువత చేతుల్లోనే ఉందన్నారు. విద్య, ఉద్యో గ, ఉపాధి రంగాల్లో యువత తాము ఎంచు కున్న రంగంలో రాణించాలన్నారు. ఎండబ్ల్యూఎస్‌డీఎస్‌ ఆధ్వర్యంలో యువతులకు టైలరింగ్‌, మెహిందీ డిజైన్‌లలో శిక్షణ, విద్యార్థులకు ఎప్‌సెట్‌, టెట్‌, డీఎస్సీ వంటి వాటిలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం హర్షణీయమన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి అకాడమిక్‌ ఎక్సలెన్స్‌ అవార్డులు ప్రదానం చేయడం వల్ల వారిలో ప్రోత్సాహాన్ని నింపిన వారవుతారన్నారు. కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కమాల్‌ అతర్‌, ఎండబ్ల్యూఎస్‌డీఎస్‌ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ యూనస్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి అబ్దుల్‌ ఖయ్యూం అతర్‌, నాయకులు అబ్దుల్‌ రవూఫ్‌, ఫారూఖ్‌ సాహిల్‌, బాబర్‌, అబ్దుల్‌ ఘని, పలు పాఠశాలల ప్రతినిధులు అజార్‌, షకీల్‌ ఉమ్రి, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

పీఎస్‌కు వచ్చేవారితో

మర్యాదగా మెలగాలి

కడ్తాల్‌: పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించడంతోపాటు సమస్యలను వెంటనే పరిష్కరించాలని శంషాబాద్‌ డీసీపీ రాజేశ్‌ సూచించారు. కడ్తాల్‌ పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎస్‌లోని రికార్డులు, పెండింగ్‌ కేసుల ఫైళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. అఽధికారులు ఇచ్చే సలహాలు, సూచనలను పాటిస్తూ విధులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. శాంతిభద్రతలను పరిరక్షిస్తూ సమాజంలో పోలీసుల గౌరవాన్ని పెంచాలని, నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ గస్తీ పెంచాలని ఆదేశించారు. డయల్‌ 100కు వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ గంగాధర్‌, ఎస్‌ఐ శివశంకర వరప్రసాద్‌ పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement