సెక్యూరిటీ గార్డు అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

సెక్యూరిటీ గార్డు అదృశ్యం

May 19 2025 7:57 AM | Updated on May 19 2025 7:57 AM

సెక్యూరిటీ గార్డు అదృశ్యం

సెక్యూరిటీ గార్డు అదృశ్యం

శంషాబాద్‌ రూరల్‌: ఫాంహౌజ్‌లో పని చేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు అదృశ్యమైన ఘటన మండలపరిధిలోని కవేలిగూడలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అసోం రాష్ట్రం కచార్‌ జిల్లాకు చెందిన రాజు తంతి(42) ఉపాధి కోసం వచ్చి కవేలిగూడలో దామోదర్‌రావుకు చెందిన గ్రీన్‌వుడ్‌ ఫాంహౌజ్‌లో 7 నెలలుగా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఇతనితో పాటు రాకేశ్‌ అనే వ్యక్తి కూడా పని చేస్తూ ఇద్దరు కలిసి అక్కడే నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 10న రాజు గదికి తాళం వేసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. 2 రోజుల తర్వాత విషయం రాజు సోదరుడు బీజుకు తెలియడంతో పలుచోట్ల ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రూ.3.60 లక్షల విలువైన విదేశీ మద్యం పట్టివేత

52 మద్యం బాటిళ్లు స్వాధీనం

ముగ్గురి పై కేసు నమోదు, ఇద్దరి అరెస్ట్‌

సాక్షి, సిటీబ్యూరో: అక్రమంగా తరలిస్తున్న 52 విదేశీమద్యం బాటిళ్లను ఎకై ్సజ్‌ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆదర్శనగర్‌లో ఓ కారులో మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్‌ పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో ముగ్గురిపైన కేసులు నమోదు చేసిన పోలీసులు కుమార్‌ అగ్రవాల్‌, రోహిత్‌కుమార్‌ అనే వ్యక్తులను అరెస్ట్‌చేశారు. ఇన్నోవా కారును సీజ్‌ చేశారు.

మెట్రోస్టేషన్‌లో ప్రకటనల టెలివిజన్‌ చోరీ

సనత్‌నగర్‌: మెట్రో స్టేషన్‌లో ప్రకటనలు డిస్‌ప్లే చేసే టీవీ చోరీకి గురైన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ జయచందర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..పరేడ్‌గ్రౌండ్స్‌ మెట్రో స్టేషన్‌లోకి గత నెల 19న ఉమామహేశ్వర్‌, అశోక్‌ అనే ఇద్దరు టెక్నీషియన్స్‌గా పనిచేసేందుకు వచ్చారు. అయితే స్టేషన్‌ కంట్రోలర్‌కు తెలియకుండానే స్టేషన్‌లోని ఓడీయూ గదిని యాక్సెస్‌ చేశారు. అందులోని స్కైవర్త్‌ టెలివిజన్‌ సెట్‌ను విప్పదీసుకుని వెళ్లారు. ఈ సంఘటన మొత్తం స్టేషన్‌ సీసీ టీవీ కెమెరాల్లో నమోదైంది. టెలివిజన్‌ చోరీ అయిన విషయాన్ని గుర్తించిన మెట్రో అధికారులు, అంతర్గత విచారణ అనంతరం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప్పల్‌ మెట్రో డిపోలో పనిచేస్తున్న కృషాదర్శని ఫిర్యాదు మేరకు శనివారం బేగంపేట పోలీసులు ఉమామహేశ్వర్‌, అశోక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధ దంపతులపై దాడి

వ్యక్తిపై కేసు నమోదు

హస్తినాపురం: ఇంట్లో ఒంటరిగా ఉన్న వయోవృద్ధులపై భూలక్ష్మీనగర్‌కాలనీ సంక్షేమ సంఘం సెక్రటరీ రవికిరణ్‌ దాడికి పాల్పడిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..ద్వారకామాయినగర్‌ కాలనీలో ఉంటున్న వయోవృద్ధులైన గుత్త లక్ష్మీతులసీ, వేణుగోపాల్‌ దంపతుల ఇంటికి భూలక్ష్మీనగర్‌కాలనీ సంక్షేమ సంఘం సెక్రటరీ రవికిరణ్‌ కుమారుడు వచ్చి పనులకు ఆటంకం కలిగించేవాడు. దీంతో వేణుగోపాల్‌ ఇంటికి రావొద్దని చెప్పడంతో నన్నుక్టొటాడని రవికిరణ్‌కు అతడి కుమారుడు చెప్పడంతో కోపోద్రికుడైన రవికిరణ్‌ తన అనుచరులతో కలిసి ఆ దంపతుల ఇంట్లోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డాడు.బాధితుల ఫిర్యాదు మేరకు రవికిరణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement