
జిల్లా ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యం
తాండూరు: కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితో పాటు సీహెచ్‌సీ, పీహెచ్‌సీ ఆస్పత్రులు అప్‌గ్రేడ్ కానున్నాయి. పట్టణంలో రెండున్నర దశాబ్దాలుగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. ఇప్పటి వరకు ఆస్పత్రిలో మైనర్ సర్జరీలే జరుగుతున్నాయి. గుండె, న్యూరో సంబంధిత సర్జరీలు ఆస్పత్రిలో నిర్వహించేందుకుగాను కావాల్సిన పరికరాలను తీసుకురానున్నారు. కిడ్నీ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరగడంతో ఇప్పటికే అందుబాటులో ఉన్న డయాలసిస్ బెడ్లను పెంచనున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి సత్వర వైద్య సేవలు అందించేందుకుగాను ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.
సీహెచ్‌సీ, పీహెచ్‌సీల అప్‌గ్రేడ్
నియోజవకర్గంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్ గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు విన్నవించారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి వారం రోజుల వ్యవధిలో తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ పీహెచ్‌సీలో 24 గంటల పాటు వైద్య సేవలు అందించేలా ఉత్తర్వులు అందిస్తానని ఎమ్మెల్యే బీఎంఆర్‌కు హామీ ఇచ్చారు. బషీరాబాద్ మండలంలో ఉన్న రెండు పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్‌తో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని వెంటనే వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు.
త్వరలో గుండె, న్యూరో సంబంధిత సర్జరీలు
పీహెచ్‌సీల అప్‌గ్రేడ్‌కు ఉత్తర్వులివ్వాలని వైద్యారోగ్య కార్యదర్శికి మంత్రి ఆదేశం
త్వరలో ఐసీయూ సేవలు
తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి ప్రాణాపాయ స్థితిలో వచ్చే వారికి సత్వర వైద్య సేవలు అందించేందుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ) విభాగాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. అందుకోసం వైద్యారో గ్యశాఖ మంత్రిని అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించారు. కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో జిల్లా ప్రభు త్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నాం. – బుయ్యని మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు

జిల్లా ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యం