
పరిష్కరించండి
ఆధ్యాత్మికతతో.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొని మానసిక ప్రశాంతత పొందాలని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు.
భూ సమస్యలు
11లోu
ధారూరు: భూ భారతి అవగాహన సదస్సుల్లో రైతులు ఇచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని కేరెళ్లి, కుక్కింద గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. భూముల వివరాల్లో తప్పులు ఉంటే తహసీల్దార్ కార్యాలయంలోనే పరిష్కరించుకోవచ్చని సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ఇకపై కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదన్నారు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేస్తే చాలన్నారు. అధికారులు రైతులు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలి క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు. భూ భారతి చట్టంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్లు, రైతులు పాల్గొన్నారు.
ధాన్యం సేకరించాలి
మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు విధిగా ఉండాలని, నిర్వాహకులు రైతులను వేధించకుండా చూడాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌తో కలిసి గట్టెపల్లి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో జాప్యం చేయరాదని సూచించారు. లక్ష్యానికి అనుగుణంగా వడ్లు సేకరించాలన్నారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలన్నారు.
ఇందిరమ్మ ఇంటి పనుల పరిశీలన
మండలంలోని అవుసుపల్లిలో చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ పరిశీలించారు. గ్రామానికి ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయని, ఎన్ని నిర్మాణ దశలో ఉన్నాయని ఎంపీడీఓ నర్సింహులును అడిగారు. గ్రామానికి 117 ఇళ్లు మంజూరు కాగా ఏడు పునాదుల పనులు పూర్తయినట్లు వివరించారు. మరో ఐదు నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. తనకు పింఛను వస్తున్నందున హౌసింగ్ డీఈ ఇంటి నిర్మాణ పనులను ఆపేశారని గ్రామానికి చెందిన సోమారం అశోక్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వెంటనే బిల్లు మంజూరు చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సమయంలో పాత ఇళ్ల వద్ద ఫొటోలు దిగామని, అయితే తమకు మరోచోట స్థలాలు ఉన్నందున అక్కడ ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని పలువురు కలెక్టర్‌ను అభ్యర్థించగా సానుకూలంగా స్పందించారు. గ్రామ పంచాయతీ నుంచి స్థలానికి సంబంధించిన పత్రాలు తీసుకొని ఎంపీడీఓకు అందజేయాలని సూచించారు. తాను పునాది పనులు పూర్తి చేసుకున్నా పాత గోడ ఉన్న కారణంగా బిల్లు ఆపేశారని న్యాయం చేయాలని ఓ వ్యక్తి కలెక్టర్‌ను వేడుకున్నాడు. బిల్లు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్
కేరెళ్లి, కుక్కింద గ్రామాల్లో భూ భారతి అవగాహన సదస్సులు