
మెరుగైన వైద్యం ప్రభుత్వ లక్ష్యం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేవారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ కేంద్రంలోని 30 పడకల ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ రూ.27 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆస్పత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆస్పత్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించానన్నారు. ప్రస్తుతం ఆస్పత్రి అప్‌గ్రేడ్, భవన నిర్మాణం చేయించడం సంతృప్తినిచ్చిందన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయ కులు ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమానికి పెద్ద ఎత్తు న హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతుముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, ఎ–బ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి