
ఎల్లమ్మ జాతరకు సహకరించాలి
తాండూరు రూరల్: మండలంలోని కోత్లాపూర్‌లో వెలసిన రేణుకా ఎల్లమ్మ తల్లి జాతరకు ప్రతి ఒక్క రూ సహకరించాలని, ఎవరైనా గొడవలు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. నెల రోజుల పాటు జరిగే జాతరకు తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. సీసీ కెమెరాల నీడలో జాతర జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 30న రథోత్సవం ఉంటుందని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. జాతరలో గొడవలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని ఎస్‌ఐ విఠల్‌రెడ్డిని ఆదేశించారు.
గొడవలు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తాం
తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి