
దప్పిక తీరుస్తున్న దాతృత్వం
షాద్‌నగర్: సమాజ సేవలో మేము సైతం అంటూ ముందుకుసాగుతున్నారు పట్టణానికి చెందిన పలువురు వ్యక్తులు. ఏటా వేసవిలో చలివేంద్రాలు, అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దప్పిక తీరుస్తున్నారు. షాద్‌నగర్‌కు చెందిన వాసవి చిట్ ఫండ్ అధినేత, విశ్వహిందు పరిషత్ రాష్ట్ర కోశాధికారి బండారి రమేశ్ తన తల్లిదండ్రులైన దివంగత లక్ష్మమ్మ, రాజయ్యల జ్ఞాపకార్థం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట 20 ఏళ్లుగా చలివేంద్రం ఏర్పాటు చేసి, బాటసారులు, స్థానికులు, ప్రయాణికులకు తాగునీరు పంపిణీ చేస్తున్నారు. పదేళ్లుగా అంబలి సైతం అందజేస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం షాద్‌నగర్ వచ్చే ప్రజలు ఇక్కడ మంచినీళ్లు, అంబలి తాగి ఉపశమనం పొందుతున్నారు. అలాగే న్యూసిటీ కాలనీకి చెందిన శ్రీనివాస్‌చారి పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న పోచమ్మ దేవాలయం ఎదురుగా చలివేంద్రం, మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గత మూడేళ్లుగా నిత్యం వందలాది మందికి మంచినీళ్లు, మజ్జిగ అందజేస్తున్నారు.
షాద్‌నగర్‌లో చలివేంద్రాలు, అంబలి కేంద్రాల నిర్వహణ
వేసవిలో ఉపశమనం పొందుతున్న బాటసారులు, స్థానికులు