విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
ధారూరు: మేతకు వెళ్లిన ఎద్దు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. జీడీగడ్డ తండాకు చెందిన నెనావత్ రవీందర్‌నాయక్ ఎద్దులను మేతకోసం పొలానికి తీసుకెళ్లాడు. మేత మేస్తున్న ఎద్దు దగ్గరకి ఆవు రావడంతో దానిని వెంబడిస్తూ ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లింది. అక్కడ ఉన్న సపోర్టు తీగను తాకింది. దానికి విద్యుత్ సరఫరా ఉండడంతో విద్యుదాఘాతానికి గురై ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు విలువ దాదాపు రూ.60వేల వరకు ఉంటుందని రైతు బోరున విలపించాడు. ఈ విషయంలో ప్రభుత్వం తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
ప్రేమ పేరుతో వేధింపులు
ఉరేసుకుని బాలిక ఆత్మహత్య
శంషాబాద్ రూరల్: ప్రేమ పేరిట వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని పెద్దతూప్రలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వి.జంగయ్య, అనిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు దివ్య(16)ను అదే గ్రామానికి చెందిన తెలగమల్ల రవి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 16న రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ రెండో అంతస్తులో నిద్రకు ఉపక్రమించారు. అదే రోజు రాత్రి దివ్య సెల్‌ఫోన్ తీసుకుని కింద అంతస్తులోకి వెళ్లింది. ఎంతసేపటికి పైకి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా గది లోపలి నుంచి గడియపెట్టి ఉన్నది. దీంతో కిటికీ నుంచి లోపలికి చూడగా.. దివ్య చున్నీతో పైకప్పు ఉక్కుకు ఉరేసుకుని కనిపించింది. తలుపులు తెరిచి లోనికి వెళ్లి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. రవి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి రవిని అదుపులోకి తీసుకున్నారు.
సీఎంఆర్‌ఎఫ్‌చెక్కుల అందజేత
ఆమనగల్లు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు మాడ్గుల, వెల్దండ మండలాలకు చెందిన పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. సీఎం సహాయనిధి పథకం పేదలకు వరమని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్‌రెడ్డి, మెకానిక్ బాబా, కృష్ణ, యాదయ్య, పోలెపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి


