
పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంపు
మొయినాబాద్: పచ్చిరొట్ట పైర్ల సాగుతో భూమిలో భూసారాన్ని పెంచుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త ఎస్.జి మహాదేవప్ప అన్నారు. మొ యినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరులో గురువారం వరిలో యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి సాగులో రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. పచ్చిరొట్ట పైర్లతోపాటు సేంద్రియ ఎరువులను వాడి అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. పంటమార్పిడి విధానం, చిరుధాన్యాల సాగుతో భూమి ఆరోగ్యాన్ని పెండంతోపాటు పర్యావరణ సంరక్షించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త రమేష్, సహాయ వ్యవసాయ సంచాలకులు బీజే సురేష్, ఏఓ అనురాధ, ఏఈఓ సునీల్, రైతులు పాల్గొన్నారు.