సమస్యల పరిష్కారానికే ‘భూ భారతి’
ధారూరు: రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి చట్టం పని చేస్తుందని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. ధారూరు మండలం రాజాపూర్, నాగారం, కొండాపూర్‌ఖుర్దు గ్రామాల్లో శుక్రవారం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ.. కోర్టు పరిధిలో ఉన్న వాటిని మినహాయించి అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా జిల్లా, డివిజన్, మండల స్థాయిలోనే భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్లు జాజిదాబేగం, శ్రీనివాస్, దీపక్ సాంసన్, డీటీ విజయేందర్, ఆర్‌ఐ స్వప్న, రెవన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్


