రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కుల్కచర్ల: రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం కుల్కచర్ల మార్కెట్ యార్డులో రూ.5 లక్షలతో ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ యార్డుకు వచ్చే రైతుల కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, పాంబండ ఆలయ చైర్మన్ మైపాల్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కనకం మొగులయ్య, చౌడాపూర్ మండల అధ్యక్షుడు ఎల్పాటి అశోక్‌కుమార్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర ఆలయంలో పీఆర్‌టీయూ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ అబీబ్ అహ్మద్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్నాథ్, మండల అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బస్వరాజు, గౌరవ అధ్యక్షుడే నర్సింలు, కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి, ఉపాధ్యాయ సంఘం నాయకులు వెంకటయ్య, కృష్ణయ్య, ఆనంద్, మహేష్, తిరుపతిరెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ తదితరులు


