ప్రజలతో మమేకమవ్వండి
ధారూరు/బంట్వారం: ప్రజలతో మమేకం కావడంతోపాటు మర్యాదగా మెలగాలని ఎస్పీ స్నేహ మెహ్ర పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. సోమవారం ధారూరు సీఐ, ఎస్‌ఐ కార్యాలయాలు, కోట్‌పల్లి, బంట్వారం పోలీస్‌స్టేషన్లనుసందర్శించారు. ముందుగా రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. కేసులను పెండింగ్‌లో ఉంచరాదన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై నిఘా ఉంచాలని తెలిపారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రతంగా ఉంచుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో సీఐ రఘురామ్, బంట్వారం, కోట్‌పల్లి ఎస్‌ఐలు విమల, ఎం.శైలజ పాల్గొన్నారు.
చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు
అనంతగిరి: సంక్రాంతి పండుగ సమీపిస్తున్నందున గాలి పటాలు ఎగురవేస్తుంటాని, ఇందు కోసం చైనా మాంజాను ఉపయోగించరాదని ఎస్పీ స్నేహ మెహ్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించిందన్నారు. దీన్ని వాడటం వల్ల ద్విచక్ర వాహనదారులకు, పక్షుల ప్రాణాలకు ముప్పు కలుగుతుందన్నారు. ఎవరైనా ఈ మాంజాను విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గాలి పటాలు విక్రయించే దుకాణాలపై నిఘా ఉంటుందని తెలిపారు. ఎవరైనా చైన మాంజాను విక్రయిస్తున్నట్లు తెలిస్తే స్థానిక పోలీసులు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.


