యూరియా విక్రయంపై ప్రత్యేక నిఘా
అదనపు కలెక్టర్ సుధీర్
అనంతగిరి: జిల్లాలో యూరియా విక్రయంపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎలాంటి అవకతవకలు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. సోమవారం నగరం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో యూరియా నిల్వలు, విక్రయాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. సాగుకు సరిపడా అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, ఉద్యానవన అధికారి సత్తార్, డీసీఓ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.


