మైనింగ్ పాలసీలో మార్పులు చేయాలి
అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు: కొత్త మైనింగ్ పాలసీలో మార్పులు చేయకపోతే తాండూరు ప్రాంత నాపరాతి వ్యాపారులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతారని ఎమ్మె ల్యే మనోహర్‌రెడ్డి అన్నారు.సోమవారం అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం రావడంతో నియోజవకర్గంలోని పలు ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. తాండూరు నాపరాయి షాబాద్ స్టోన్‌గా ఎంతో ప్రసి ద్ధి చెందిందని, ఈ పరిశ్రమపై ఆధారపడి 30 వేల కుటుంబాలు జీవిస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు. కొత్త మైనింగ్ పాలసీతో చిన్నచిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రాయల్టీ అధికంగా ఉండటం, విద్యుత్ బిల్లులు పెంచడంతో పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు నాపరాతితో కట్టుకునేందుకు ప్రత్యేక జీఓ జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదే తరహాలో ప్రత్యేక జీఓ తెస్తే గని కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. తాండూరు మున్సిపాలిటీ ది నదినాభివృద్ధి చెందుతున్నందున తాగునీటి అవసరాల కోసం కొత్త పంప్‌హౌస్,పైప్‌లైన్ ఏర్పాటు చే యాల్సి ఉందన్నారు. ఇందుకోసం రూ.40 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసినట్లు వివరించారు. నిధులు మంజూరు చేయాలని కోరారు. భూ నిర్వాసితులకు రూ.30 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉండటంతో బైపాస్ రోడ్డు పనులు ఆగిపోయాయని వెంటనే చర్యలు చేపట్టాలని ఆయా శాఖల మంత్రులను కోరారు. తాను సభ దృష్టికి తెచ్చిన అంశాలను సంబంధిత శాఖల మంత్రులు రికార్డు చేసుకున్నట్లు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తెలిపారు. తాండూరు నాపరాయి పరిశ్రమపై ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడంపై క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్, స్టోన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు నయిం కృతజ్ఞతలు తెలిపారు.


