పురోగమనం
● పరిగి – షాద్‌నగర్ రోడ్డును నాలుగు లేన్లగా విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ.100 కోట్లతో టెండర్లు పూర్తి చేశారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
● పరిగి – వికారాబాద్ మధ్య ఉన్న డబుల్ రోడ్డును నాలుగు లైన్లగా విస్తరించాలని నిర్ణయించారు. రూ.140 కోట్లతో టెండర్లు పూర్తి చేశారు. రూ.7 కోట్లతో వంతెన నిర్మించనున్నారు.
● పరిగి నియోజకవర్గం గడిసింగాపూర్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం రంగారెడ్డిపల్లి వరకు రెండు వరుసల రహదారిని నిర్మించనున్నారు. దీంతో పాటు వికారాబాద్ – గోధుంగూడను కూడా డబుల్ రోడ్డుగా విస్తరించాలని నిర్ణయించారు. ఈ రెండింటిని కలిపి ఒక ప్యాకేజీ కింద రూ.210 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు.
● కొడంగల్ పట్టణంతోపాటు అగ్గనూరు నుంచి బషీరాబాద్ మీదుగా మైల్వార్ వరకు రోడ్లు మంజూరైంది. ఇందుకోసం రూ.151 కోట్లు విడుదలయ్యాయి.
● కొడంగల్ పట్టణంలో నాలుగు లేన్లు, మిగతా రోడ్డును రెండు లేన్లుగా విస్తరించనున్నారు. తుంకిమెట్ల నుంచి నారాయణపేట వరకు, కోటకొండ నుంచి మద్దూరు వరకు రహదారిని విస్తరించటంతో పాటు రెండు బ్రిడ్జిల నిర్మాణానికి రూ.295 కోట్లు కేటాయించి టెండర్లు పూర్తి చేశారు.
● వికారాబాద్ – తాండూరు రోడ్డును రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తారు. జిల్లాలో అంతర్గత రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. ఇందులో కొన్ని పనులు ప్రారంభం కాగా కొన్ని పూర్తయ్యాయి.
● కొడంగల్‌కు నర్సింగ్ కళాశాల మంజూరైంది. ఇందుకోసం రూ.46 కోట్లు కేటాయించారు. మెడికల్ కళాశాలకు రూ.124.50 కోట్లు కేటాయించారు. పారామెడికల్, ఫిజియోథెరపీ కళాశాల కోసం రూ.27 కోట్లు విడుదల చేసింది. కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రిని విస్తరించి 220 పడకల సామర్థ్యంతో టీచింగ్ హాస్పిటల్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఇందు కోసం రూ.27 కోట్ల నిధులు కేటాయించారు. పనులు చివరి దశలో ఉన్నాయి.
● కొడంగల్ – నారాయణ్‌పేట ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని పెంచి రూ.2,945 కోట్లతో పనులు చేపట్టాలని ప్రభుత్వంనిర్ణయించింది.
● కోస్గీలోని పాల్‌టెక్నిక్ కళాశాలను ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.30 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆయా గురుకులాల నిర్మాణానికి రూ.20 కోట్లు వెచ్చించనున్నారు.
● కొడంగల్ పట్టణంలో రూ.7 కోట్లు ఖర్చు చేసి ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని నిర్మించారు.
● ఆయా మండలాల్లో రోడ్ల విస్తరణకు రూ.344 కోట్లు, ప్రభుత్వ పాఠశాలల భవన నిర్మాణాలకు రూ.30 కోట్లు, కొడంగల్ పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.16 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఈ పనులు ప్రారంభమయ్యాయి.
● రూ.42 కోట్లతో మున్సిపల్ భవనాన్ని అందుబాటులోకి తెచ్చారు.
● హరేరామ హరేకృష్ణ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన అందిస్తున్నారు.
● పరిగి నియోజకవర్గం పూడూరులో రూ.3,100 కోట్లతో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి.
● పరిగి, కొడంగల్ మీదుగా వికారాబాద్ – కృష్ణా మక్తల్ రైల్వే లైన్ మంజూరైంది.
● భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 430 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.3,600 కోట్లు.
● పరిగి మున్సిపాలిటీలో రోడ్ల నిర్మాణానికి రూ.25 కోట్లు కేటాయించగా పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ప్రజల తాగునీటి అవసరాల కోసం రూ.16 కోట్లతో పనులు చేపట్టారు. మరో రూ.8 కోట్లతో ఆరు విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నారు.
● లక్నాపూర్ ప్రాజెక్టులో బోటింగ్ సౌకర్యం కల్పించారు.
● వికారాబాద్ పట్టణంలోని రైల్వే ఫ్లై ఓవర్ పనులు వేగంగా సాగుతున్నాయి.
● స్వదేశీ దర్శిని పేరుతో అనంతగిరులను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనులు జరగనున్నాయి. రూ.33 కోట్లతో మొదటి దశ పనులకు టెండర్లు పిలిచారు.
● వికారాబాద్, తాండూరు ప్రాంతాలకు నీరందించే కోట్‌పల్లి ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభుత్వం రూ.89.3కోట్లు మంజూరు చేసింది. త్వరలో పనులు ప్రారంభంకానున్నాయి.
● వికారాబాద్‌లో జనరల్ ఆస్పత్రిభవనాన్ని అందుబాటులోకి తెచ్చారు. మెడకల్ కళాశాల భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
● తాండూరులో రూ.16 కోట్లు వెచ్చించి చిలకవాగు ప్రక్షాళన పనులు చేపట్టారు. రూ.20 కోట్లతో మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేసి తరగతులు ప్రారంభించారు.
● మోమిన్‌పేటలో మొబిలిటీవ్యాలి కోసం, నవాబుసేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు, జిన్‌గుర్తిలో పారిశ్రామిక వాడ కోసం గత ప్రభుత్వ హయాంలోనే భూములుసేకరించగా పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
చిగురిస్తున్న ప్రజల ఆశలు కొడంగల్‌కు నిధుల వరద ఇప్పటికే పట్టాలెక్కిన పలు ప్రాజెక్టులు రోడ్లకు మహర్దశ పరిగి, కొడంగల్ మీదుగా రైల్వే లైన్ అనంతగిరి పర్యాటక అభివృద్ధికి టెండర్లు ముందుకు సాగని ‘వుడా
జిల్లాలో వేగం పుంజుకున్న అభివృద్ధి పనులు
వికారాబాద్: జిల్లా అభివృద్ధి దిశగా సాగుతోంది. రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు, కళాశాలలు, పారిశ్రామిక వాడ, ఇతర మరమ్మతు పనులకు నిధులు మంజూరు కావడంతో ఇప్పుడిప్పుడే అభివృద్ధి పట్టాలెక్కుతోంది. వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరు నియోజకవర్గాల్లో పలు పనులకు శంకుస్థాపనలు జరగ్గా, మరి కొన్ని ప్రారంభోత్సవాలను నోచుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నేతలు జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అభివృద్ధికి నిధుల వరద పారింది. కడా (కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఏర్పాటు చేసి రూ.వేల కోట్లు విడుదల చేశారు. అయితే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 594 గ్రామ పంచాయతీలను కలుపుతూ వుడా(వికారాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేసి ఏడాది కాస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. పురపాలికలు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఒక్కో మున్సిపల్‌కు రూ.15కోట్ల నుంచి రూ.20 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ పనులు శంకుస్థాపన దశలోనే ఆగిపోయాయి. జిల్లాలో అంతర్గత రోడ్లు, బ్రిడ్జీలు అధ్వానంగా మారాయి. వీటి మరమ్మతులకు నిధులు కేటాయించాలనే డిమాండ్ ఉంది.
సీఎం సొంత నియోజకవర్గంలో..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు విడుదల చేశారు. రోడ్లు, భవనాలు, విద్య, వైద్యం, ప్రాజెక్టులు, పారిశ్రామిక వాడ, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకానికి రూ.2,945 కోట్లు కేటాయించారు. దుద్యాల్ మండలంలో మల్టీ పర్పస్ ఇండ్రస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పరిగి నియోజకవర్గం పూడూరులో నేవీ రాడార్ స్టేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రానికి ఆనుకుని వెళ్లేలా ట్రిపుల్‌ఆర్ ప్రాజెక్టు డిజైన్ చేయడం, ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా ఖరారు చేశారు. జిల్లాలో ఈ ఏడాది 14 వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఒక్కో నియోజకవర్గానికి 3వేల చొప్పున 12వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేశారు. చాలా చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి. మరికొన్ని చోట్ల ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవంటూ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించలేదు.
రోడ్లకు భారీగా నిధులు
కొడంగల్‌కు నిధుల వరద
మిగిలిన మూడు
నియోజకవర్గాల్లో..
1/3
పురోగమనం
2/3
పురోగమనం
3/3
పురోగమనం