శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

Dec 31 2025 9:56 AM | Updated on Dec 31 2025 9:56 AM

శ్రీవ

శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

అనంతగిరి: అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ తన కూతురు అనన్యతో కలిసి మంగళవారంతిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.

విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు తెండి

కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

అనంతగిరి: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు కలెక్టరేట్‌కు వచ్చే వారు బొకేలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకరావద్దని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సూచించారు. వాటి స్థానంలో పేద విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌ బుక్స్‌, పెన్నులు, పెన్సిళ్లు, దుప్పట్లు ఇతర సామగ్రి ఇవ్వాలన్నారు. చలికాలం కావడంతో దుప్పట్లు ఇస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

దోమ: ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతను అలర్చుకోవాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం దోమ మండలం బొంపల్లి తండాలో భవానీ మాత ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దైవభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొప్పుల వెంకట నాగిరెడ్డి, సర్పంచుల సంఘం మండల మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి, బొంపల్లి తండా సర్పంచ్‌ గోపాల్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాములు, నేతలు సంగయ్య, వెంకటయ్య, మాన్యనాయక్‌, హరి తదితరులు పాల్గొన్నారు.

నేరాలను నియంత్రిద్దాం

కర్ణాటక రాష్ట్రం కలుబుర్గి ఎస్పీ శ్రీనివాస్‌

తాండూరు రూరల్‌: నేరాల నియంత్రణకు కలిసి పనిచేద్దామని కర్ణాటక రాష్ట్రం కలుబుర్గి ఎస్పీ శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం తెలంగాణ – కర్ణాటక సరిహద్దు పోలీసుల సమావేశం చించోళి తాలూకా కర్చకాలం సమీపంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మత్తు పదార్థాలు అక్రమ రవాణా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య, కరన్‌కోట్‌ ఎస్‌ఐ రాథోడ్‌ వినోద్‌ పాల్గొన్నారు.

ప్రయాణికుల భద్రతే

అంతిమ లక్ష్యం

రైల్వే ఎస్పీ చందనాదీప్తి

అనంతగిరి: రైల్వేలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ చందనాదీప్తి అన్నారు. మంగళవారం ఆమె వికారాబాద్‌లోని రైల్వే పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతే అంతిమ లక్ష్యం కావాలన్నారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మాదకద్రవ్యాలు, గంజాయి తరలించడానికి అక్రమార్కులు రైళ్లను ఎంచుకుంటున్నారని ఈ విషయంలో ఆర్‌పీఎఫ్‌, ఎకై ్సజ్‌ శాఖ అధికారులతో కోఆర్డినేషన్‌తో పనిచేసి వాటి నివారణకు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ 
1
1/2

శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ 
2
2/2

శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement