
భూ భారతితో సమస్యలకు చెక్
ధారూరు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో అధికారులు గ్రామలకు వచ్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారని వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర చెప్పారు. గురువారం మండలంలోని అంతారంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న ధారూరు మండలాన్ని భూ సమస్యలు లేని మండలంగా చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సదస్సుల్లో రైతుల నుంచి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించే విధంగా రెవెన్యూ అధికారులు పని చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన భూ సమస్యల దరఖాస్తులను రైతుల నుంచి స్వీకరించి పరిశీలించారు. మోమిన్‌కలాన్, అంతారం, మోమిన్‌ఖుర్దు గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 59 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో తహసీల్దార్లు సాజిదాబేగం, శ్రీనివాస్, దీపక్‌సాంసన్, డీటీ విజయేందర్, ఆర్‌ఐ స్వప్న, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
నేటి రెవెన్యూ సదస్సులు
మండల పరిధిలోని కొడాపూర్‌ఖుర్దు, రాజాపూర్, నాగారం గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులను శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. ఆయా గ్రామాల్లో రైతులు భూ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర