
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
పరిగి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని టీయూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏలను వెంటనే ప్రకటించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఇతర రాష్ట్రాల ఉద్యోగులకు ఒక్క డీఏ కూడా బకాయి లేదన్నారు. తెలంగాణలో మాత్రం ఐదు డీఏలు బకాయి ఉన్నట్లు పేర్కొన్నారు. నిండు సభలో ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి అప్పు పుట్టడం లేదని అనడం సరికాదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ గోపాల్, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, నా యకులు బస్వరాజ్, జాంప్ల, రూప్‌సింగ్, బాలకృష్ణ, నరేందర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
టీయూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రెడ్డి