
అన్ని మతాలకు సమన్యాయం
పరిగి: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని మతాలకు సమన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే టి రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పరిగి నియోజకవర్గం నుంచి 22 మంది ముస్లీంలు హజ్‌యాత్రకు ఆదివారం బయలు దేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే నాంపల్లిలో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లీంలకు హజ్‌యాత్ర పవిత్రమైందన్నారు. జీవితంలో ఒక్క సారైన హజ్‌యాత్రను సందర్శించాలనే కలా ఉంటుందన్నారు. అలాంటి కలను సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్ అంటేనే అన్ని మతాలను గౌరవిస్తూ అందరికి సమన్యాయం కల్పిస్తుందన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి