
సేవాభావాన్ని అలవర్చుకోవాలి
తాండూరు టౌన్: ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాండూరులో ఏఎస్‌జీఎంకే ట్రస్టు చైర్మన్ ముజీబ్‌ఖాన్‌తో కలిసి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ, వైద్య, కంటి శిబిరాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సంపాదించిన దానిలో కొంత మొత్తం పేదలను ఆదుకునేందుకు ఉపయోగించాలన్నారు. తాండూరు ప్రాంతంలో పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్రస్ట్ చైర్మన్ ముజీబ్‌ఖాన్ అభినందనీయుడున్నారు. అనంతరం ముజీబ్‌ఖాన్ మాట్లాడుతూ.. స్వార్థ చింతనను వదిలి పేదలకు ప్రతి ఒక్కరూ తోచిన సహాయ సహకారాలు అందించాలన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరణం పురుషోత్తం రావు, అబ్దుల్ రవూఫ్, డాక్టర్ సంపత్‌కుమార్, రవి, భగవాన్, రఘు, శివానంద్, సంకేత్, తేజ్ అబ్దుల్లా, మసూద్, గపూర్ తదితరులు పాల్గొన్నారు.
రైతు జితేందరెడ్డిని ఆదుకుంటాం
తాండూరు రూరల్: విద్యుదాఘాతంతో చెరుకు పంట దగ్ధమైన రైతు జితేంధర్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని మండలి చీఫ్ విప్ పట్నం మహేంద్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పెద్దేముల్ మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. విద్యుదాఘాతంతో దగ్ధమైన జితేందర్‌రెడ్డి చెరుకు పంటను పరిశీలించారు. వెంటనే తహసీల్దార్‌కు ఫోన్ చేసి ప్రభుత్వం నుంచి రైతుకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పొలాల్లో విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని వెంటనే మరమ్మతులు చేపట్టాలని విద్యుత్ డీఈ భాను ప్రకాశ్‌ను ఆదేశించారు. అనంతరం పెద్దేముల్ మండల కేంద్రంలోని చిట్టెపు లక్ష్మమ్మ మృతి చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బషీరాబాద్ మండలంలో ధాన్యం కోనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట నాయకులు కరణం పురుషోత్తంరావు, డీవై నర్సింలు, బలవంత్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అజంఖాన్, సిబ్లి, బుజ్జమ్మ, బాలప్ప, రవీందర్ ఉన్నారు.
మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి