
మైలార్‌దేవ్‌పల్లిలో దేశభక్తి ర్యాలీ
మైలార్‌దేవ్‌పల్లి: ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత సైన్యం పాక్ ప్రేరేపిత ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి నేలమట్టం చేయడంపై సేవా భారతి కిశోరి వికాస్ ఆధ్వర్యంలో ఆదివారం దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. పద్మశాలీపురంలోని స్వామి వివేకానంద విగ్రహం నుంచి గణేశ్‌నగర్ బొడ్రాయి, భావన బుషికాలనీ, ఆదర్శకాలనీ, టీఎస్‌జీఓఎస్ కాలనీ, మధుబన్ కాలనీ మార్గంలో తిరిగి స్వామి వివేకానంద విగ్రహం వద్దే ముగిసింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు ఏర్వ కుమారస్వామి మాట్లాడుతూ.. ర్యాలీ ద్వారా యువతలో దేశభక్తి పెంపొందించడం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో సేవా భారతి కిశోరి వికాస్ సమన్వయకర్త లక్ష్మి, క్లబ్ ఉపాధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, సాంస్కతిక కార్యదర్శి గోంత్యాల శ్రీనివాస్, కిశోరి వికాస్ కార్యకర్తలు అడికే శ్రావణి, ఎస్.లక్ష్మి, స్వప్న, ఝాన్సీ, విద్యార్థులు పాల్గొన్నారు.