
ఆధునిక పద్ధతుల్లో బోధన చేపట్టాలి
కొత్తూరు: మారుతున్న విద్యావ్యవస్థ, పాఠ్యాంశాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు బోధన పద్దతుల్లో మార్పులు చేసుకోవాలని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఏఎస్‌పీడీ) రమేశ్ సూచించారు. బుధవారం ఆయన పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో సీఆర్పీ, ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుపై మరింత ఆసక్తి, శ్రద్ధ పెంచేందుకు ఉపాధ్యాయులు బోధనలో సాంకేతికతను వినియోగించాలన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి వారికి నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. బడిబాటలో భాగంగా బడిఈడు పిల్లను బడుల్లో చేర్పించేలా ఉపాధ్యాయులకు స్థానికులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏంఈఓ అంగూర్‌నాయక్, ఉపాధ్యాయులు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
సమగ్రశిక్ష ఏఎస్‌పీడీ రమేశ్