
లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా మురహరి
కొడంగల్: పట్టణ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సామాజిక కార్యకర్త మురహరి వశిష్టను శుక్రవారం రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2025–26 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి సమక్షంలో ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా మురహరి వశిష్ట, కార్యదర్శిగా వడ్డె భీంరాజు, కోశాధికారిగా వెంకట్‌రెడ్డి దేశ్‌ముఖ్, మెంబర్ షిప్ కమిటీ చైర్మన్‌గా ముద్దప్ప దేశ్‌ముఖ్, ఉపాధ్యక్షులుగా కేవీ రాజేందర్, దామోదర్‌రెడ్డి, జాయింట్ సెక్రెటరీగా కానుకుర్తి రమేష్, పీఆర్‌ఓగా శ్రీకిషన్‌రావులను ఎన్నుకున్నారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా ఆరు.గురునాథ్‌రెడ్డి, దాసప్ప యాదవ్, శ్రీనివాస్ గుప్త, కానుకుర్తి వెంకట్‌రెడ్డి, ఏన్గుల భాస్కర్, శివకుమార్ గుప్తాలు వ్యవహరిస్తారు. గతేడాది అధ్యక్షుడిగా పనిచేసిన మురహరి వశిష్ట ఆధ్వర్యంలో గతం నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గురునాథ్‌రెడ్డి కుటుంబానికి విధేయునిగా ఉన్న మురహరి వశిష్టను రెండోసారి లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా ఎంపిక చేయడం పట్ల ఆయన మిత్రులు బాధ్యత స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.