
సైన్యానికి మద్దతుగా పూజలు
అనంతగిరి: యుద్ధ వాతావరణ పరిస్థితులలో భాగంగా భారత్ సైన్యానికి మద్దతుగా వికారాబాద్ పట్టణంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం వికారాబాద్ (అనంతగిరి) జిల్లా గీతా వాహిని అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సదానంద రెడ్డి, ఆలయ పూజారి అనంతగిరి పంతులు, ముక్తా రెడ్డి, శ్రీరాములు, మాణిక్ రెడ్డి, నారాయణ రాథోడ్, పాపయ్య, రమేష్ గౌడ్, రవిశంకర్, మొణిగారి లావణ్య, జయశ్రీ, వరలక్ష్మి, విజయ, సరిత, అనురాధ, సరళ, రజిత తదితరులు పాల్గొన్నారు.