
ఆ లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
చేవెళ్ల: కార్మికులకోసం పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో కేంద్రం తీసుకు వచ్చే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ఏఐటీయుసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.రామస్వామి డిమాండ్ చేశారు. ఏఐటీయుసీ, సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్‌ను ఆదివారం చేవెళ్లలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం కార్మికులపై దాడి మొదలు పెట్టిందని మండిపడ్డారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 రకాల కార్మిక చట్టాలను పెట్టుబడి దారి వర్గానికి కొమ్ము కాస్తూ నాలుగు కోడ్‌లుగా చేసి కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్త ంచేశారు. కార్మికులు పోరాడి 8 గంటల పని దినాలను సాధించుకున్నారని, కాని మోదీ ప్రభుత్వం 12 గంటల పనిదినాలు తీసుకు వస్తోందని మండిపడ్డారు. దీనిని కార్మిక వర్గం తీవ్రంగా ప్రతిఘటిస్తుందని చెప్పారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి కార్మికుడికి కనీస వేత్తనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ఈనెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమ్మెను కార్మికులు, కర్షకులు, ప్రజలు, ప్రజాసంఘాలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ప్రభులింగం పాల్గొన్నారు.
ఏఐటీయుసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి