
447వ ర్యాంకు సాధించిన తాండూరు విద్యార్థి
తాండూరు టౌన్: పట్టణానికి చెందిన ఓ విద్యార్థి ఎప్‌సెట్‌లో 447 ర్యాంకు సాధించాడు. మండలంలోని చిట్టిఘనాపూర్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న గర్గుపల్లి నర్సిరెడ్డి, భ్రమరాంబ దంపతుల కుమారుడు అభినవ్‌రెడ్డి ఇంజనీరింగ్ విభాగంలో ఆదివారం విడుదలైన ఎప్‌సెట్ ఫలితాల్లో 100.27 మార్కులతో రాష్ట్రస్థాయిలో 447వ ర్యాంకు సాధించాడు. గతంలో విడుదలైన జేఈఈ మెయిన్స్‌లోనూ 97 శాతం మార్కులు సాధించాడు. ఎప్‌సెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించిన అభినవ్‌రెడ్డిని తాత మున్సిపల్ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, తల్లిదండ్రులు, తాండూరు వాసులు అభినందించారు.

447వ ర్యాంకు సాధించిన తాండూరు విద్యార్థి

447వ ర్యాంకు సాధించిన తాండూరు విద్యార్థి