
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
పరిగి: హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం పట్టణంలోని ఆయన నివాసంలో కుల్కచర్ల మండలం పీరంపల్లికి చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజానీకం కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన పథకాలే ప్రభుత్వం కొనసాగించేందుకు ఇబ్బంది పడుతోందని.. కొత్తగా వారు చేసిందేమీ లేదని విమర్శించారు. గ్రామాలు, పట్టణాల్లో ఎక్క డి సమస్యలు అక్కడే ఉన్నాయని ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వ పట్టింపు కరువయిందన్నారు. బీఆర్‌ఎస్ నుంచి వెళ్లిన నాయకులు త్వరలోనే సొంత గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎక్కు వ సీట్లు గెలుచుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి