
కార్మిక చట్టాల నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
పరిగి: కేంద్ర ప్రభుత్వం కార్మికులకు, రైతులకు అన్యాయం చేస్తోందని వ్యవపసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని కొడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన చట్టాలతో కార్మికులు కట్టుబానిసలుగా మారుతారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోదంన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య