
భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయండి
కొడంగల్: ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామస్తులు కోరారు. మంగళవారం గ్రామంలోని సర్వే నంబర్ 19కు చెందిన రైతులు ఆ భూముల వద్ద రిలే దీక్షలు చేపట్టారు. భూములిచ్చిన రైతులకు పూర్తి పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. తక్షణమే తమకు పరిహారం అందజేసి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ఎరన్‌పల్లి శ్రీనివాస్, మల్లేశ్, ఆశమ్మ, బసప్ప, అమృతప్ప, శేఖర్, నర్సప్ప, రాములు గౌడ్, సావిత్రమ్మ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
పార్టీలు బీఎల్‌ఓలను నియమించుకోవాలి
తహసీల్దార్ విజయ్‌కుమార్
కొడంగల్: ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులు ఉంటే సరిచేయించుకోవాలని తహసీల్దార్ విజయ్‌కుమార్ సూచించారు. మంగళవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు సమాయత్తమవ్వాలని సూచించారు. ప్రతీ పార్టీ నుంచి బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ రమేశ్‌బాబు, మాజీ కౌన్సిలర్ మధుయాదవ్, సీపీఐ నాయకుడు ఇందనూర్ బషీర్, ఆసిఫ్ ఖాన్, తలారి శేఖర్, శంకర్‌నాయక్, కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజులు సెలవులో ఉన్నా ..
● నాపై చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదు
● యాచారం ఎస్‌ఐ మధు
యాచారం: తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది పగడాల శ్రీశైలం తనపై రాచకొండ సీపీ సుధీర్‌బాబుకు చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని యాచారం ఎస్‌ఐ మధు అన్నారు. మంగళవారం ఆయన శ్రీసాక్షిశ్రీతో మాట్లాడుతూ.. శ్రీశైలం ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఏప్రిల్ 13, 14 తేదీల్లో తమ కూతు రు పుట్టిన రోజు వేడుకలు ఉన్నందున రెండు రోజులు సెలవులో ఉన్నట్లు వివరించారు.
పండుగలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి
ఏసీపీ రంగస్వామి
షాద్‌నగర్: పండుగలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ రంగస్వామి సూచించారు. హనుమాన్ జయంతి శోభాయాత్ర, బక్రీద్ పండుగ, సందర్భంగా పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో మంగళవారం శాంతి సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏసీపీ రంగస్వామి మాట్లాడుతూ.. ప్రత ఒక్కరు పరమత సహనం పాటించాలన్నారు. బక్రీద్, హనుమాన్ జయంతి వేడుకలు హిందూ, ముస్లింలు సోదరభావంతో ఐకమత్యంగా జరుపుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పోలీసులకు సహకరించా లని కోరారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ విజయ్‌కుమార్, ఎస్‌ఐ విజయ్‌కుమార్, నాయకులు బాబర్‌ఖాన్, ఇబ్రహీం, వెంకటేశ్, జమృద్‌ఖాన్, సిరాజుద్దీన్ పాల్గొన్నారు.

భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయండి