
సమాజంలో మార్పు కోసమే ఆర్‌ఎస్‌ఎస్
కుల్కచర్ల: హిందుత్వవాదాన్ని బలోపేతం చేయడం.. సమాజంలో మార్పు తెచ్చేందుకే ఆర్‌ఎస్‌ఎస్ కృషి చేస్తోందని ప్రాంత కార్యకారిని సభ్యుడు సుబ్రహ్మణ్యం అన్నారు. మండల కేంద్రంలో వారం రోజులుగా కొనసాగుతున్న శిక్షణ సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న క్రమంలో నాటి నుంచి నేటి వరకు ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించడం, అనాగరిక చర్యల నిర్మూలన, సేవాకార్యక్రమాలు నిర్వహణ, హిందుత్వంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి, జిల్లా సంఘ చాలక్ గోవర్దన్ రెడ్డి, జిల్లా కార్యావాహ సంఘమేశ్వర్, రవి, శ్రీను, రమేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రాంత కార్యకారిని సభ్యుడు సుబ్రహ్మణ్యం