
యాగశాల భూమిపూజ ప్రారంభం
అత్తాపూర్: హైదర్‌గూడలో ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహించే శ్రీ ప్రణవ భక్త సమాజం ఏకశతపంచోత్తర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా యాగశాల కోసం ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ప్రణవ భక్త సమాజం అధ్యక్షుడు మోండ్ర నర్సింహ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రణవ భక్త సమాజం ఉపాధ్యక్షుడు బర్ల మల్లారెడ్డి, ముఖ్య సలహాదారులు నారగూడెం మల్లారెడ్డి, సాబాద విజయ్‌కుమార్, సభ్యులు సులిగె మహేందర్, విద్యాసాగర్, సాయియాదవ్, కిషన్, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ మహోత్సవ పత్రాల పంపిణీ
శ్రీ ప్రణవ భక్త సమాజం సభ్యులు ఆదివారం ఇంటింటికీ తిరుగుతూ మహోత్సవాల పత్రికలను పంపిణీ చేసి హాజరుకావాలని కోరారు.