
ప్రజావాణికి 68 అర్జీలు
అనంతగిరి: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 68 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, ఆయాశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీలో అడ్మిషన్లకు ‘దోస్త్’లో రిజిస్ట్రేషన్ చేసుకోండి
షాద్‌నగర్ రూరల్: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలో అడ్మిషన్ కోసం వెంటనే దోస్త్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేరుకోవాలని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె సూచించారు. ఈనెల 21 వరకు అవకాశం ఉందని తెలిపారు. 29న అడ్మిషన్ల కేటాయింపుపై తొలి జాబితా విడుదలవుతుందని పేర్కొన్నారు. ఈనెల 30 నుంచి జూన్ 6 వరకు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. వివరాలకు 6305051490, 9885003390, 9703441345 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఇబ్రహీంపట్నం కళాశాలలో..
ఇబ్రహీంపట్నం: 2025–26 విద్యాసంవత్సరానికి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ (దోస్త్) ద్వారా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు చేరేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డా.రాధిక సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు 89199 96725, 94417 05076, 93810 6920 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.